‘మిస్టర్ మజ్ను’ టీజర్ చూసారా…?
Spread the love

అఖిల్ నుంచి మూడవ సినిమాగా రానున్న ‘మిస్టర్ మజ్ను’ కోసం అక్కినేని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు.విదేశీ లొకేషన్స్ లో అఖిల్,నిధి అగర్వాల్ కి సంబంధించిన సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు.

కథలోని పాత్రకి తగినట్టుగానే అఖిల్ చాలా రొమాంటిక్ గా కనిపించాడు.ఇక నిధి అగర్వాల్ లుక్స్ తోనే కుర్రకారు మనసులు దోచేసింది.ఈ సినిమా టీజర్ ఒక్క రాత్రి లోనే 2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. జనవరి 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.