మరోసారి తాత కాబోతున్న మెగాస్టార్ చిరంజీవి!
Spread the love

మెగాస్టార్ చిరంజీవి మరోకసారి తాతయ్య కాబోతున్నారు.చిరంజీవి కుటుంబంలో మరోక చిన్నారి రాబోతు౦ది.చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ రెండోవ సారి తల్లి అవ్వబోతుంది.ఆ విషయాన్నీ స్వయంగా ఆమె భర్త కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

కల్యాణ్ తన భార్యతో కలసి ఉన్న ఫొటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు.దాంతో పాటు “శ్రీజ కల్యాణ్ బేబీ2 #లోడింగ్…” అంటూ కామెంట్ పెట్టాడు.ఆయన పోస్ట్ చేసిన ఫొటోలో శ్రీజ గర్భవతిగా ఉన్నట్టు స్పష్టంగా కనపడుతోంది.2016లో శ్రీజ,కల్యాణ్ లు పెళ్లాడిన సంగతి తెలిసిందే.శ్రీజకు మొదటి భర్త భరద్వాజ్ ద్వారా ఇప్పటికే ఒక కూతురు ఉంది.ఆ చిన్నారి శ్రీజ వద్దే పెరుగుతోంది.

SreejaKalyanBaby2 #Loading . . .

Posted by Kalyan Dhev on Monday, 5 November 2018