డాన్స్ తో దుమ్మురేపిన రాజమౌళి,రామ్ చరణ్
Spread the love

మూవీ స్టార్స్ అంటేనే వెండితెరపై స్టెప్పులేయటం, వాటిని చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేయటం మామూలే ! అదే స్టార్ కథానాయకులు రియల్ లైఫ్‌లో ఎంజాయ్ చేస్తూ డాన్సులేయటం చూస్తే.. అభిమానుల ఆనందానికి అవధులుంటాయా చెప్పండి. పైగా టాప్ కథానాయకుడు , టాప్ డైరెక్టర్ తీన్‌మార్ డాన్స్ చేస్తే.. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అది ఖచ్చితంగా కన్నుల పండగే! తాజాగా దర్శకుడు రాజమౌళి, హీరో రామ్ చరణ్‌ల తీన్‌మార్ డాన్స్ సినీ లోకానికి ఆనందాల విందు చేసింది.

రాజమౌళి కుమారుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్ పెళ్లి డిసెంబర్ 30వ తేదీన అంగరంగ వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి టాలీవుడ్ లోని పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. పెళ్లి సంబరాల్లో పాల్గొనడానికి గాను రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ సహా పలువురు సినీ తారలు ఇప్పటికే జైపూర్ చేరుకున్నారు. అయితే రేపు (ఆదివారం) జరగనున్న పెళ్లి సంబరాలు ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి . పలువురు తారల సందడి చూసేవాళ్లను ఆకట్టుకుంటోంది. ఈ సంబరాల్లో రాజమౌళి, రామ్ చరణ్ కలిసి తీన్‌మార్ బ్యాండ్‌కి హుషారుగా డాన్సులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబందించిన వీడియో, పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి చూసి మెగా అభిమానులు తెగ ఆనందపడుతున్నారు