హోమ్లీగా కనిపించిన నిహారిక..
Spread the love

టైటిల్ : సూర్యకాంతం
జానర్ : రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నిహారిక కొణిదెల, రాహుల్‌ విజయ్‌, పర్లీన్‌, శివాజీ రాజా, సుహాసిని తదితరులు
సంగీతం :మార్క్‌ కె.రాబిన్‌
దర్శకత్వం : ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి
నిర్మాత : రాజ్‌ నిహార్

మెగా డాటర్‌గా బుల్లితెరపై సందడి చేసిన నిహారిక కొణిదెల.. వెండితెరపై ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఒక మనసు చిత్రంతో తెరకు పరిచయమై.. గతేడాది హ్యాపీ వెడ్డింగ్‌ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. అయినా నిహారికకు అనుకున్న విజయం మాత్రం లభించలేదు. తనకు మంచి పేరు తీసుకువచ్చిన ముద్దపప్పు ఆవకాయ్‌ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించిన దర్శకుడితో కలిసి ఈసారి ఎలాగైనా సక్సెస్‌ కొట్టేందుకు ‘సూర్యకాంతం’గా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు నిహారిక. మరి ఈ మూవీతో అయినా.. ఇంతకాలం సక్సెస్‌ కోసం ఎదురుచూస్తున్న నిహారికకు మంచి ఫలితాన్ని ఇచ్చిందా? లేదా అనేది ఓ సారి చూద్దాం.