“పెట్టా” సినిమాలో బీట్ సాంగ్ విన్నారా…?
Spread the love

సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుంది.2.0 తరువాత రజినీకాంత్  కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో “పెట్టా” చిత్రం తో రాబోతున్నాడు.ఈ చిత్రం నుంచి ఇటివలే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.తాజాగా చిత్ర యూనిట్ ‘మరణ మాస్’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేసారు.ఈ చిత్రానికి అనిరుధ్ సంగీత౦ అందిస్తున్నాడు.ఈ మాస్ బీట్ తో ఉన్న ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.ఈ లిరికల్ వీడియో విడుదల చేసిన అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ సాధించింది.

సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.సిమ్రాన్, త్రిష, బాబీ సింహా, సనంత్, మేఘా ఆకాశ్, తదితరులు ఇతర ముఖ్య తారాగణం.ఈ చిత్రం 2019 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.