డీప్ లిప్ లాక్ తో చెలరేగిన పంజాబీ భామ !
Spread the love

పంజాబీ అమ్మాయి పంజాబీ వేషాలు వేయకుండా గుజరాతీ వేషాలేస్తుందా? పంజాబ్ – దిల్లీ ఒణికేలా డీప్ లిప్ లాక్ లతో చెలరేగిపోయింది తాప్సీ. ఈ దెబ్బకు మరోసారి ఉత్తరాది బాక్సాఫీస్ షేకైపోవడం కచ్చితమే అనిపిస్తోంది. మరీ అంత డీప్ లిప్ లాకా? ఇది నిజమా.. అని ఆలోచిస్తున్నారా ?.. ఒకవేళ సందేహం ఉంటే మీరే ఈ ట్రైలర్ లో వీక్షించవచ్చు .  అసలు ఇ౦తకీ  `పింక్` – `జుడ్వా 2` తర్వాత మళ్లీ తాప్సీ హిట్ కొట్టగలుగుతుందా ? అంటే కొట్టేసేలాగానే కనిపిస్తోంది. ఈ ట్రైలర్ చూసైనా తర్వాత ఆ సందేహం రాక మానదు. తాప్సీ నటించిన మన్మార్జియాన్ ట్రైలర్ పిచ్చెక్కించిందంటే నమ్మండి. ఈ ట్రైలర్ లో ముక్కోణపు ప్రేమకథ మతి పోగొట్టింది . యువకుల గుండెల్ని తాకేంత ఎమోషన్ ఉంది. ముఖ్యంగా విక్కీ కౌశల్ తో తాప్సీ వేసిన లిప్ లాక్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. కథ డిమాండ్ చేసింది కాబట్టే ఈ లిప్ లాక్ అని సరిపెట్టుకుంటే ట్రైలర్ ఆద్యంతం ముగ్గురు ప్రేమికుల మధ్య ఎమోషన్ పీక్స్.

అసలే ఇద్దరు కుర్రాళ్లు తన వెంట పడుతున్నారు. ఆ రింగుల జుత్తులో.. ఆ డొప్ప ముక్కులో .. చిలిపి కళ్లలో ఇంకేదో నచ్చింది కాబట్టి ప్రేమకోసం తెగ కొట్టుకుపోతున్నారు. పంజాబి గెటప్పుల్లో అభిషేక్ బచ్చన్ – కౌశల్ అద్భుతంగా ఒదిగిపోయారు. ఇన్నిరోజులకి అభిషేక్కి తగ్గ పాత్ర పడిందని అర్థమవుతోంది. ఎంతో ఎంతో విషయం ఉంది కాబట్టే అలా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. మరి సినిమా ఏ లెవెల్ లో ఆడుతుందో చూడాలి. మన్మార్జియాన్ సెప్టెంబర్ 14న విడుదలవుతుంది . అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో ఆనంద్ .ఎల్.రాయ్ ఈ సినిమాని నిర్మించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.