చంద్రబాబు భార్య గా మలయాళ హీరోయిన్?
Spread the love

స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్.. దీనికి  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుంటే.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పలు కీలక పాత్రలకు పలువురు సీనియర్, జూనియర్ నటీనటులను ఎంపిక చేస్తున్నారు.

దీనిలో భాగంగా , ఎన్టీఆర్ అల్లుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్రలో రానా దగ్గుబాటి చేయన్నున్నారు . అలాగే, చంద్రబాబు  భువనేశ్వరి పాత్ర లో  మంజిమా మోహన్ నటించనుంది.

అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన చిత్రం “సాహసం శ్వాసగా సాగిపో” సినిమా లో ఇంతకుముందు  హీరోయిన్‌గా నటించింది. ఈమెను చంద్రబాబు భార్య భువనేశ్వరి పాత్రకు ఎంపిక చేసినట్టు  సమాచారం

అలాగే, అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్‌ నటిస్తుండగా, ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో విద్యాబాలన్, సావిత్రిగా కీర్తి సురేష్‌లను ఎంపిక చేశారు.మరికొన్ని కీలక పాత్రల్లో ప్రకాష్ రాజ్, కైకాల సత్యనారాయణ, రవి కిషన్, మురళీ శర్మ, సచిన్ ఖేదేకర్‌లు నటిస్తుంటే, ఈ చిత్రాన్ని బాలకృష్ణ, విష్ణు ఇందూరిలు కలిసి నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి  సంగీతం అందిస్తున్నారు  ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది