రేపే మణికర్ణిక టీజర్ రిలీజ్
Spread the love

దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున (ఆగస్టు 15) ‘మణికర్ణిక’ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసి మూవీ పై మంచి హైప్‌ క్రియేట్‌ చేసుకున్నారు ‘మణికర్ణిక’ యూనిట్ . ఇప్పుడు అక్టోబర్‌ 2 అంటే… గాంధీ జయంతి రోజున టీజర్‌ను విడుదల చేసి మరింత మంది ప్రేక్షకుల దృష్టిని తమవైపు తిప్పుకోవడానికి ప్లాన్‌ చేశారు. ఇది దేశభక్తి సినిమా కావడం వల్ల ఇలా దేశభక్తికి రిలేట్‌ అయిన తేదీలలో మూవీ ప్రమోషన్‌ను ప్లాన్‌ చేస్తే ప్లస్‌ అవుతుందని మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లున్నారు. అందుకేనేమో మూవీ విడుదల కూడా వచ్చే ఏడాది రిపబ్లిక్‌ డేకి మార్చుకున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ చేస్తున్న సినిమా ‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’. క్రిష్‌ దర్శకుడు .

కానీ క్రిష్‌ తెలుగులో ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ సినిమాతో బిజీగా ఉండటం వల్ల కొంత షూట్‌ కోసం కంగనా డైరెక్షన్‌ చైర్‌లో కూర్చున్నారన్న విషయం తెలిసిందే. మూవీ డైరెక్షన్‌ క్రెడిట్‌లో తనకు భాగస్వామ్యం వద్దని, అవుట్‌పుట్‌ రావడంలో ఒక భాగంగానే తాను డైరెక్షన్‌ సీట్‌లో కూర్చున్నానని ఆమె తెలియజేసారని బాలీవుడ్‌ టాక్‌. ఈ సంగతి ఇలా ఉంచితే… ‘మణికర్ణిక’ బృందం నుంచి తాజాగా నటి స్వాతి సెమ్వాల్‌ కూడా వైదొలిగినట్లు బీటౌన్‌ టాక్‌. ఈ చిత్రంలో పార్వతి అనే క్యారక్టర్ కి స్వాతిని తీసుకున్నారట. అయితే తన పాత్రకు ప్రాముఖ్యతను తగ్గించారనే కారణంగా స్వాతి ఈ సినిమాకి గుడ్‌ బై చెప్పారట. రీసెంట్‌గా సోనూసూద్‌.. తాజాగా స్వాతి తప్పుకోవడంతో ‘మణికర్ణిక’ మూవీ మళ్లీ బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.