జనవరి 25న విడుదల కానున్న ‘మణికర్ణిక’
Spread the love

ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన వీర వనిత ఝాన్సీ లక్ష్మీ బాయ్‌ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం మణికర్ణిక. కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ డైరెక్టర్ . అయితే క్రిష్‌.. యన్‌.టి.ఆర్‌ షూటింగ్‌లో బిజీ కావటం వల్ల మణికర్ణిక సినిమాకి కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఆఖరి పాట షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ నర్మద ఘాట్‌లో జరుగుతోం‍ది. దీంతో చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.