‘మహేష్’ తో ‘కత్రినా’
Spread the love

సూపర్ స్టార్ మహేష్ బాబు, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘మహర్షి’. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ సాగుతోంది . ఈ సినిమా తర్వాత మహేష్.. ఇటీవల ‘రంగస్థలం’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్‌తో మూవీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే స్టోరీ చర్చలు కూడా ముగిసిన ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి రోజుకో వార్త వస్తుంది . అయితే తాజాగా ఈ సినిమాలో నటించే కథానాయిక విషయంలో ఓ వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో నటించడానికి బాలీవుడ్ టాప్ కథానాయిక కత్రినా కైఫ్ సరే అన్నదట . ‘మల్లీశ్వరి, అల్లరి పిడుగు’ వంటి తెలుగు సినిమాలలో నటించిన కత్రినా కైఫ్.. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమని పట్టించుకోలేదు. ‘బాహుబలి’ సినిమా తర్వాత బాలీవుడ్ కథానాయికలు కూడా టాలీవుడ్ అంటే ఇష్టపడుతున్నారు. ఇప్పటికే విద్యాబాలన్.. టాలీవుడ్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘యన్.టి.ఆర్’ సినిమాలో చాలా కీలకమైన రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కత్రినా కూడా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవివాదానికి ఇష్టపడుతోందని, అది మహేష్ బాబు సినిమాతోనే అనే వార్తలు తాజాగా వస్తున్నాయి . అయితే సినిమా బృందం నుంచి మాత్రం ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన వినిపించలేదు