పెళ్లి గురించి అడిగితే కత్రీనా ఏం చెప్పిందంటే ?
Spread the love

బాలీవుడ్‌లో వెడ్డింగ్ సీజన్ నడుస్తోంది. అనుష్క, సోనమ్, దీపిక, ప్రియాంకా చోప్రాలు ఇటీవలే పెళ్లిళ్లు చేసుకున్నారు. తాజాగా హీరోయిన్ కత్రీనాకైఫ్ తన పెళ్లి, పిల్లల ఆలనాపాలన గురించి తన మనసులోని మాటను ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది ‘కొద్ది రోజుల నుంచి నా మనసులో ఇదే విషయం తిరుగుతోంది. అయితే దీనిని నేను భగవంతునికే విడిచిపెట్టేశాను. జీవితంలో ఏది మనకు నిర్ధారితమై ఉందో, దానినే చేస్తుంటాం. ఇది గ్రహించాక శాంతంగా ఉండగలుగుతున్నాను. మనకు వచ్చిన ఆలోచనలన్నీ సాకారం కావు’ అని తెలిపారు. కాగా కత్రీనా రణబీర్‌కపూర్‌తో ఐదేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. 2016లో వీరికి బ్రేక్ అప్ అయింది. అప్పటి నుంచి కత్రీనా సింగిల్‌గానే ఉంటోంది. ప్రస్తుతం రణబీర్.. అలియాభట్‌తో డేట్‌లో ఉంటున్నాడు. కాగా కొంతకాలం క్రితం వరకూ కత్రీనా, అలియా స్నేహితులుగా ఉన్నారు. తాజాగా రణబీర్, అలియాభట్ ప్రేమాయణం కారణంగా కత్రీనా, అలియాల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం.