మైనస్ డిగ్రీల నీటిలో ఈతకొట్టిన కత్రిన కైఫ్
Spread the love

కొత్త సంవత్సరం వేడుకలను ఒక్కొక్క సెలబ్రిటీ ఒక్కోచోట జరుపుకున్న వేళ,బాలీవుడ్‌ భామ కత్రిన కైఫ్‌ చాలా విభిన్నంగా న్యూ ఇయర్ వేడుకలను జరుపుకుంది.ప్రస్తుతం ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీల్లోకి పడిపోయిన పశ్చిమ యూరప్ లోని ఇంగ్లిష్ చానల్ వద్దకు వెళ్లి, అందులో ఈత కొట్టింది.

ఈ సమయంలో ఇంగ్లిష్‌ ఛానెల్‌ లో ఈదేందుకు సాధారణంగా ఎవ్వరూ సాహసం చేయరు.ఇక ఇక్కడి నీటిలో తన తల్లి, సోదరితో కలిసి ఈతకొట్టిన కత్రిన, ఈ వీడియోను తన ఇన్‌ స్టాగ్రామ్‌ లో అభిమానులతో షేర్ చేసుకుంది. సముద్రంలో ఈత కొడితే చాలా బాగుంటుందని, అయితే, ఇటువంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల మాట వినాలని చెప్పింది. ఎవరినీ కించపరచవద్దని, శరీరాన్ని, మనసును ఒకే చోట ఉంచాలని ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టింది. ఇక కత్రిన పెట్టిన వీడియో సోషల్ మీడియా లో హాల్ చల్ చేస్తున్నాయి.