‘దమయంతి’లో రాధిక
Spread the love

కర్ణాటక సీఎం కుమారస్వామి రెండో భార్య రాధిక త్వరలోనే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు . రాధికా కుమారస్వామి చేయబోయే చిత్రానికి టైటిల్ ఫిక్స్ అయింది. నవరసన్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఆ చిత్రానికి ‘దమయంతి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. నవంబర్ 12న ఈ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది. కథానాయిక ఓరియెంటెడ్ తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధికా కుమారస్వామి టైటిల్ రోల్ పోషిస్తున్నారు.

1980వ సంవత్సరం బ్యాక్‌డ్రాప్‌లో హారర్ కామెడీగా ఈ చిత్రం రానుంది . ఈ చిత్రంలో వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌‌ను భారీగా ఉపయోగించబోతున్నారు. ఆక్టర్ , ప్రొడ్యూసర్ విశాల్ తండ్రి జీకే రెడ్డి ఈ చిత్రంలో రాధికకు తండ్రిగా నటించడం విశేషం. అందువల్ల ఈ చిత్రాన్ని కన్నడలో తమిళం, తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. నవరసన్ దర్శకుడు మరియు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సాధుకోకిల, తబలా నాని, విజయ్ చందూర్, కెంపేగౌడ్, పవన్, కార్తిక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కుమారస్వామితో పెళ్లి తర్వాత రాధికా చిత్రాలకు విరామం ఇవ్వడం వల్ల ఆమె చిత్రాలు వదిలేసి రాజకీయాల్లో చేరనున్నట్లు పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెడుతూ రాధికా కుమారస్వామి తన తదుపరి సినిమాని ప్రకటించేశారు. ప్రస్తుతం చేస్తున్న ‘దమయంతి’తో పాటు ‘భైరదేవి’ అనే మరో చిత్రం కూడా ఆమె చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీజై దర్శకత్వం వహించే ఈ మూవీలో రమేష్ అరవింద్ మేల్ లీడ్ రోల్ పోషించబోతున్నారు.