కబడ్డీ ప్లేయర్‌గా ‘కంగనా రనౌత్‌’ ‘పంగా’
Spread the love

‘మణికర్ణిక: ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ’.. కంగనా రనౌత్‌ నెక్ట్స్‌ విడుదల ఇదే. వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా జనవరి 25న రిలీజ్ కానుంది. ఈ మూవీ తర్వాత ‘పంగా’ అనే చిత్రంలో కబడ్డీ ప్లేయర్‌గా నటించనున్నారు కంగనా రనౌత్‌. అశ్వనీ అయ్యర్‌ దర్శకురాలు .

మరి.. ఆ తర్వాత కంగనా మూవీ ఏంటి? అంటే ఓ లవ్‌స్టోరీ అ ని బాలీవుడ్‌ తాజా టాక్‌. ఈ చిత్రాన్నికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది . పూర్తి విభిన్నమైన ప్రేమకథతో ఈ సినిమా రపొందనుందట. ఇక హైలైట్‌ పాయింట్‌ ఎంటంటే… ఈ చిత్రాన్ని కంగనానే డైరెక్షన్ చేస్తారట . ఇటీవల ‘మణికర్ణిక’ మూవీ ప్యాచ్‌ వర్క్‌ కోసం కంగనా మెగాఫోన్‌ పట్టిన సంగతి తెలిసిందే.