‘మణికర్ణిక’ చిత్రానికి కంగన పారితోషికం ఎంతో తెలుసా?
Spread the love

బాలీవుడ్ కథనాయిక కంగన మంచి నటే కాదు స్ట్రాంగ్ లేడీ కూడా. బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారుగా ఆ కోవలోకే వస్తుంది. ఏ టాపిక్ అయినా నిర్భయంగా చెప్తుంది .అలా మాట్లాడితే గొడవలు వస్తాయని ఏం తగ్గదు . జంకూ గొంకూ లేకుండా తనమనసుకు ఏది అనిపిస్తే అదే ఫైనల్ అన్నట్టుగా దుమ్ము లేపుతుంది . తాజాగా ఈ బాలీవుడ్ క్వీన్ పారితోషికం ఒక హాట్ టాపిక్ అయింది.

సాధారణంగా కంగనా ఒక చిత్రానికి రూ. 5 – 6 కోట్ల మధ్యలో తీసుకుంటుందట. కానీ ‘మణికర్ణిక’ చిత్రానికి రూ. 14 కోట్ల పారితోషికం తీసుకుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ప్రకారం ‘మణికర్ణిక’ చిత్రానికి ఎక్కువ పారితోషికం తీసుకునే టాప్ కథానాయిక లిస్టు లో చేరినట్టే. ఆ లిస్టు లో ప్రస్తుతం దీపిక మాత్రమే ఉంది. ఆమె తన చివరి సినిమా ‘పద్మావత్’ కు దాదాపు ఇదే రేంజ్ లో పారితోషికం తీసుకుందని.. ఆ చిత్రంలో నటించిన షాహిద్ కపూర్ – రణవీర్ సింగ్ ల కంటే దీపిక రెమ్యునరేషన్ ఎక్కువని సమాచారాలు వచ్చాయి. ఇప్పుడు కంగన కూడా లీడ్ రోల్ లో నటిస్తూ పారితోషికం విషయం లో సంచలనం సృష్టించింది.

ఇక రాణి లక్ష్మిబాయి పాత్రలో నటించిన ‘మణికర్ణిక’ జనవరి 25 వ తారీఖు న రిపబ్లిక్ డే వీకెండ్ లో విడుదల కానుంది. క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కొంతభాగం పెండింగ్ షూట్ మాత్రం కంగన డైరెక్షన్ లో జరిగింది. ఇప్పటికే ప్రోమోస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘మణికర్ణిక’ కంగన స్టార్డం ను మరింతగా పెంచడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తం వెలువడుతున్నాయి .