కాజల్ కి జెట్ ఎయిర్వేస్ లో చేదు అనుభవం
Spread the love

ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ పై సినీ నటి కాజల్ అగర్వాల్ మండిపడింది. ప్రయాణికుల పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ముంబై ఎయిర్ పోర్టుకు 75 నిమిషాల ముందుగానే తాము చేరుకున్నప్పటికీ కౌంటర్ స్టాఫ్ అయిన మొయిన్ అనే వ్యక్తం తమ సమయాన్ని వృథా చేశాడని తెలిపింది.

ఆ తర్వాత ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి డొమెస్టిక్ టెర్నినల్ వద్దకు విమానాన్ని తీసుకువచ్చి మరో 30 నిమిషాల పాటు పార్క్ చేశారని మండిపడింది.గంటసేపు డోర్లను కూడా మూసి ఉంచారని మండిపడింది.ఎయిర్ వేస్ సిబ్బంది తీరుతో తామంతా ఎంతో ఇబ్బంది పడ్డామని కాజల్ అగర్వాల్ తెలిపింది.