ఛాలెంజ్ విసిరిన “తారక్”
Spread the love

కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌కు సెలబ్రిటీల నుండి అనూహ్య స్పందన వస్తోంది. ప్రధాని మోదీ పిలుపుతో భారతీయులంతా ఫిట్‌గా ఉండాలనే ఉద్దేశంతో క్రీడామంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌అనే ఛాలెంజ్‌‌ను సోషల్ మీడియాలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ ఫిట్‌నెస్ చాలెంజ్‌లో భాగంగా హృతిక్‌ రోషన్‌, విరాట్‌ కోహ్లీ, సైనా నెహ్వాల్‌‌, దీపికా పదుకొనే, అఖిల్ అక్కినేని, నాగ చైతన్య, సమంత, రకుల్ ప్రీత్ తదితరులు జిమ్‌లో కసరత్తులు చేసే ఫోటోలు, వీడియోలనే షేర్ చేశారు. 

తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా హమ్‌ ఫిట్‌తో ఇండియా ఫిట్‌లో భాగస్వామ్యం అవుతూ.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోను షేర్ చేసి.. ఇదిగో నా ఫిట్ నెస్ మీరూ నిరూపించుకోండి అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు ఫిట్ నెస్ సవాల్ విసిరారు. ఎన్టీఆర్‌తో పాటు సూర్య శివకుమార్‌, పృథ్వీ సుకుమారన్‌‌లను కూడా ఈ ఫిట్‌నెస్ సవాల్‌కి ఆహ్వానించారు మోహన్ లాల్. 

వీరిద్దరూ జనతా గ్యారేజ్ సినిమాలో కనిపించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి క్లోజ్ అయ్యారు. ఇకపోతే మోహన్ లాల్ విసిరిన ఛాలెంజ్ కి తారక్ గట్టి రీప్లై ఇచ్చాడని చెప్పాలి. కష్టపడి రోజు చేసే వర్కౌట్ ట్రైనర్ స్టీవెన్ తో చేస్తున్నట్లు వివరించిన ఎన్టీఆర్ అదే తరహాలో మరికొంత మందికి ఛాలెంజ్ విసిరాడు. ఇప్పుడు నందమూరి కళ్యాణ్ – మహేష్ బాబు – రామ్ చరన్ – రాజమౌళి – కొరటాల శివ.. అందరికి నా ఛాలెంజ్.. అని తారక్ వారిని ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు.

ఇక రామ్ చరణ్ కి ట్విట్టర్ ఎకౌంట్ లేదు కాబట్టి ఆయాన సతీమణి ఉపాసనని ట్యాగ్ చేస్తూ.. దయచేసి చరన్ కు తెలియజేయండి అని తారక్ ట్వీట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియా ట్రెండ్ అవుతోంది. మరి వారందరి నుంచి ఎంత స్ట్రాంగ్ గా రీప్లై వస్తుందో చూడాలి.