ఘనంగా Jr NTR పుట్టినరోజు వేడుకలు
Spread the love

Jr NTR ఓ వైపు తన పుట్టినరోజు శుభాకాంక్షలు.మరోవైపు‘అరవింద సమేత’ఫస్ట్‌లుక్‌కు వస్తోన్న స్పందన  చూసి చాలా సంతోషపడుతున్నారు.ఈ విషయం ఆయన తాజాగా చేసిన ట్వీట్లను చదివితే అర్థమవుతోంది.పుట్టినరోజు సంధర్బంగా Jr NTR సినిమా ‘అరవింద సమేత’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.దీనికి మంచి స్పందన వస్తోంది.అలాగే ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.#HappyBirthdayNTR అనే హ్యాష్‌ట్యగ్‌తో ఏకంగా 2.2 మిలియన్ ట్వీట్లు చేశారంటే ఆయనకు శుభాకాంక్షలు ఏ రేంజులో చెప్పారో అర్థమవుతోంది.

పుట్టినరోజు సంధర్బంగా ఫస్ట్ లుక్‌

తారక్ బర్త్ డే ముందు రోజు రిలీజైన ఈ ఫస్ట్ లుక్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీతో కత్తి పట్టుకున్న ఎన్టీఆర్ మాస్ లుక్ చూసి అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఆదివారం తారక్ బర్త్ డే సందర్భంగ హారిక హాసిని క్రియేషన్స్‌ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది.అయితే సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదరిస్తోన్నవారికి, తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ తారక్ కృతజ్ఞతలు తెలిపారు.ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు.‘అరవింద సమేత ఫస్ట్‌లుక్‌పై ఇంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.మీరు చేసిన ట్వీట్స్ అన్ని చదివి అద్భుతమైన అనుభూతి పొందాను. ఇంతకు మించి ఎక్కువ అడగదలుచుకోలేదు.నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నా సహచరులు, శ్రేయోభిలాసులు, సినీ పరిశ్రమ సభ్యులకు బిగ్ థ్యాంక్స్’ అంటూ తారక్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఫస్ట్ విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేసిన కొడుకు అభయ్ రామ్

ఈసందర్భంగా ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలోని సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ సారి బర్త్ డేకి ఎన్టీఆర్ కు మొదటి విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేశారో స్పెషల్ పర్సన్.ఎన్టీఆర్ ముద్దుల కొడుకు అభయ్ రామ్..ఎన్టీఆర్ కు ఫస్ట్ విషెస్ చెప్పి సర్ ప్రైజ్ చేశాడట.గత ఏడాదిలాగే అభయ్ రామే ఫస్ట్ బర్త్ డే విషెస్ తెలియజేశాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే గత ఏడాది లాగా కాకుండా ఈ సారి ఎన్టీఆర్ కళ్లు మూయకుండా అభయ్ కూడా ఫొటోకు ఎంచక్కా పోజు ఇచ్చాడట ఎట్టకేలకు అభయ్ నా కళ్లు మూయడం ఆపేశాడు.అభయ్ పెద్దవాడవుతున్నాడు.అయినప్పటికీ ఎప్పటిలా నాకు మొదట బర్త్డే విషెస్ చెప్పాడు”అని ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్ తోపాటు అభయ్ కూడా స్టిల్ ఇచ్చిన  ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

NTR కు రామ్ చరణ్ &మహేశ్ బాబు బర్త్ డే విషెస్

హ్యాపీ బర్త్ డే బ్రదర్.ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నానని రామ్ చరణ్ ఫేస్‌బుక్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాడు.తారక్‌ను వెనుక వైపు నుంచి సరదాగా పట్టుకున్న ఫొటోను చెర్రీ పోస్ట్ చేశాడు.హ్యాపీ బర్త్ డే తారక్.నీకు విజయాలు రావాలని, అంతా సానుకూలంగా ఉండాలని కోరుకుంటున్నానని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్‌కు చెర్రీ, ప్రిన్స్ బర్త్ డే విషెస్ చెప్పడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.‘అరవింద సమేత.. వీరరాఘవ’ అంటూ త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఫస్ట్‌లుక్‌తో ఫ్యాన్స్‌ను థ్రిల్ చేశారు.

కొద్ది రోజులుగా టాలీవుడ్ లో హీరోలు సరికొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.గతంలో మాదిరికాకుండా ఒకరి సినిమా వేడుకలకు ప్రారంభోత్సవాలకు మరొకరు హాజరు కావడం వారి పుట్టిన రోజు పెళ్లి రోజులకు శుభాకాంక్షలు తెలపడం వంటివి చేస్తూ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నారు.తమ అభిమాన హీరోలు కలిసి మెలిసి ఉండడంతో ఫ్యాన్స్ మధ్య కూడా స్నేహపూర్వకవాతావరణం ఏర్పడింది.త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న`అరవింద సమేత వీర రాఘవ`చిత్రం ప్రారంభోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరై అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.ఆ తర్వాత  హీరో రామ్ చరణ్ ఉపాసనలు ఎన్టీఆర్ ప్రణతి దంపతులకు 7వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఇపుడు తాజాగా ఎన్టీఆర్ 35వ పుట్టిన రోజును రామ్ చరణ్ ఫ్యాన్స్ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. రామ్ చరణ్ ఫ్యాన్స్  విజయవాడలో భారీ కేక్ కటింగ్ తో పాటు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేయనున్నారు.మరోవైపు హైదరాబాద్ లో మీడియా మిత్రులకు చరణ్ ఫ్యాన్స్ ఓ లగ్జరీ హోటల్ లో గ్రాండ్ పార్టీని ఇవ్వబోతున్నారు.దీంతోపాటు ఇరు రాష్ట్రాల్లో చరణ్ ఫ్యాన్స్-ఎన్టీఆర్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.రాజమౌళి చిత్రంలో నటించబోతోన్న సందర్భంగా ఏర్పడిన ఎన్టీఆర్- చెర్రీల స్నేహబంధాన్ని వారి ఫ్యాన్స్ కంటిన్యూ చేస్తున్నారు.టాలీవుడ్ లో మొదలైన ఈ నయా ట్రెండ్ ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.