బాలయ్య పాత్రలో జూనియర్ ఎన్టీఆర్?
Spread the love

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తన తండ్రి పాత్రను పోషిస్తున్న “ఎన్టీఆర్” బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.ఎన్టీఆర్ బయోపిక్ ప్రముఖ నటులతో నిండిపోతుంది.అందుకోసం చాలా మంది ప్రముఖ నటులను చిత్రబృందం ఎంచుకుంది.ఈ చిత్రంలో బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్,శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్,చంద్రబాబు పాత్రలో రానా,అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్,జయప్రద పాత్రను తమన్నా హరికృష్ణగా ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ పోషిస్తున్నారు.అయితే ప్రముఖమైన నటిస్తున్నాడు.

ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.NTR కథానాయకుడు,NTRమహా నాయకుడు అనే పేర్లతో ఈ రెండు భాగాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.ఈ చిత్రంలో నటిస్తున్న పలువురు నటుల పేర్లు, వారి ఫస్ట్ లుక్ కూడా బయటకు వచ్చాయి.ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను బాలకృష్ణ పోషిస్తున్నారు.మరి బాలకృష్ణ పాత్రను ఎవరు పోషించనున్నారు? గతంలో నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఈ పాత్రను పోషిస్తాడని వార్తలు వచ్చాయి?

తాజాగా బాలకృష్ణ పాత్ర మీద మరో సంచలన వార్త వైరల్ అవుతోంది.బాలకృష్ణ పాత్రను జూనియర్ ఎన్టీఆర్ పోషిస్తున్నారని త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తున్నట్లు సమాచారం.