వైమానిక యోధురాలిగా…“జాన్వీ కపూర్”
Spread the love

మొదటి సినిమాతోనే గ్లామర్ పరంగా..నటన పరంగా జాన్వీ కపూర్ మంచి పేరు తెచ్చుకుంది.అందుకే ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. జాన్వీ మాత్రం తన స్థాయిని పెంచే అవకాశం ఉన్న కథలనే ఎంచుకుంటోంది. ఈ నేపథ్యంలో కరణ్ జోహర్ నిర్మించే మల్టీ స్టారర్ తో పాటు ఒక బయోపిక్ కి కూడా జాన్వీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధారంగా రూపొ౦దుతున్న చిత్రంలో జాన్వీ నటించబోతుంది.కార్గిల్ యుద్ధంలో గుంజన్ సక్సేనా చేసిన విన్యాసాల గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు.ఇటీవలే జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనాను కలుసుకుని ఆమె అనుభవాలను అడిగి తెలుసుకున్నారట..ఈ పాత్రను చేయడానికి జాన్వీ కపూర్ అంగీకరించడం పట్ల చిత్ర యూనిట్ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తున్నారు.