నందమూరి సుహాసినికి మద్దతు తెలిపిన జగపతిబాబు…
Spread the love

తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో కూకట్‌పల్లి నుండి టీడీపీ అభ్యర్థి గా నందమూరి సుహాసిని పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. దివంగత టీడీపీ నేత హరికృష్ణ కుమార్తె అయిన సుహాసిని కూకట్‌పల్లి నుండి పోటీ చేయడం తో ఈమె గెలుపు ఖాయమని అంత ఫిక్స్ అయ్యారు. సుహాసిని కి మద్దతుగా నందమూరి హీరోలంతా ముందుకు వస్తుండగా , తాజాగా మరో సినీ నటుడు తన మద్దతును తెలిపి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఫ్యామిలీ హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా వరుస అవకాశాలు దక్కించుకుంటూ బిజీ గా మారిన జగపతి బాబు తాజాగా తన పూర్తి సపోర్ట్ సుహాసినికి అంటూ ప్రకటించాడు. సుహాసిని ఎంతో నిజాయతీ కలిగిన వ్యక్తి అని, ప్రజలకు ఆమె నిబద్ధతతో సేవ చేస్తారని తాను నమ్ముతున్నట్లుత జగపతిబాబు పేర్కొన్నారు. కూకట్‌పల్లి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఆమెను ఆ నియోజకవర్గ ఓటర్లు ఎమ్మెల్యేగా గెలిపించాలని జగపతిబాబు కోరారు. ఇప్పటి వరకు నందమూరి హీరోలు మాత్రమే అనుకుంటున్నా సమయంలో ఇండస్ట్రీ నుండి మొదటి వ్యక్తి గా జగపతి బాబు మద్దతు తెలుపడం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సహం నింపింది.