ఆలా చేస్తున్న ఇలియానా ….
Spread the love

చాలా రోజులుగా తెలుగు సినీ పరిశ్రమకి దూరంగా ఉంటున్న గోవా బ్యూటి ఇలియానా అమర్‌ అక్బర్‌ ఆంటొని చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. రవితేజ కథానాయకుడిగా శ్రీనువైట్ల డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

ఈ చిత్రంలో తన పాత్రకు ఇలియానా స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంటున్నారు. ఇటీవల పరభాషా కథానాయికలందరు తమ పాత్రలకు తామే డబ్బింగ్‌ చెప్పుకోవటం కామన్ అయిపోయింది. ఇప్పటికే కీర్తి సురేష్‌, తమన్నా, పూజ హెగ్డే లాంటి కథానాయికలు ఓన్‌ వాయిస్‌తో ఆకట్టుకోగా తాజాగా ఈ లిస్ట్‌లో ఇలియానా కూడా చేరనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న అమర్‌ అక్బర్ ఆంటొని నవంబర్‌ 16న రిలీజ్ కానుంది.