‘బొంబైరియా’:ఆ క్లిప్ దొరికితే నీ కెరీర్ క్లోజ్!
Spread the love

బాలీవుడ్ కథానాయిక రాధిక ఆప్టే ఏదైనా చిత్రంలో నటిస్తోందంటే ఆ సినిమాలో ఖచ్చితంగా డిఫరెంట్ స్టోరీ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ కావచ్చు.ఈమధ్యే రాధిక ఆప్టే ప్రధాన పాత్రలో నటించినటువంటి ‘బొంబైరియా’ అనే హిందీ మూవీ ట్రైలర్ విడుదల అయింది. క్రైమ్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ మూవీ ముంబై లోకల్ ఫ్లేవర్ తో ఉంది.

ఒక నటి.. ఒక పెళ్ళైన స్టార్ కథానాయకుడు ..వారిద్దరి ఇంటిమేట్ వీడియో ఆమె ఫోన్లో ఉంటుంది. ఫోన్ ను ఒకరు దొంగతనం చేస్తారు. ఆ నటి రాధిక ఆప్టే.. ఆ కథానాయకుడు ‘రేసుగుర్రం’ సినిమాలో విలన్ గా నటించిన రవి కిషన్. ఇదిలా ఉంటే ఆ ఫోన్ కోసం సీఐడీ వారు ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు కూడా ఆ ఫోన్ కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఒక సీన్ లో రవి కిషన్ తో రాధిక ఇలా చెప్తుంది “ఆ క్లిప్ కనుక సీఐడీ వారికి దొరికితే నీ కెరీర్ క్లోజ్ అయినట్టే”.. దీనికి సమాధానంగా ఫ్రస్ట్రేషన్ తో “నువ్వు ఆ క్లిప్పును ఎందుకు డిలీట్ చెయ్యలేదు” అని అరుస్తాడు. ఇలాంటి న్యాచురల్ డైలాగులు చాలానే ఉన్నాయి. ఒక సీన్లో ‘అతను నా ప్యూన్. నా స్కూటీ ని డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు’ అంటుంది రాధిక. మొన్న వేరే మనిషి నీ ప్యూన్ అని చెప్పావుగా అని అడిగితే “ప్రతి రోజు వేరే వేరే ప్యూన్లు ఉంటారు.. ఫిలిం ఇండస్ట్రీలో ఇలాగే ఉంటుంది” అని తడుముకోకుండా సమాధానం ఇస్తుంది.

మొత్తంగా బోల్డ్ ఫ్లేవర్ ఉన్న ఈ జెనరేషన్ మూవీ . కాస్టింగ్ అంతా సూపర్ గా ఉండడంతో మూవీ చూస్తున్నట్టుగా కాకుండా రియలిస్టిక్ గా అనిపిస్తోంది. రాధిక ఆప్టే.. రవి కిషన్ లతోపాటుగా సిద్ధాంత్ కపూర్.. అక్షయ్ ఓబెరాయ్ అదిల్ హుస్సేన్ లు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. పియా సుకన్య ఈ సినిమాకి డైరెక్టర్ . జనవరి 11 న రిలీజ్ కానుంది ఈ మూవీ . అంతలోపు ట్రైలర్ పై ఒక లుక్కేయండి.