‘ఇస్మార్ట్‌ శంకర్‌’
Spread the love

హలో గురు ప్రేమకోసమే’ వంటి హిట్‌ మూవీ తర్వాత రామ్‌ నటించనున్న సినిమాపై ఈ మధ్యే క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్లో రామ్‌ కథానాయకుడిగా ఓ మూవీ రూపొందనుంది. పూరి కనెక్ట్స్‌ సహకారంతో పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌ సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే టైటిల్‌ ప్రకటించారు. అలాగే గురువారం ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఇస్మార్ట్‌ శంకర్‌ పాత్రలో రామ్‌ కనిపించనున్నారు. పూరి స్టైల్‌కి, రామ్‌ ఎనర్జీకి తగ్గట్టుగా టైటిల్‌ మాసీగా ఉంది కదూ. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీ కోసం రామ్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యారు. ఆయన లుక్‌ ఆకట్టుకుంటోంది‘‘ఈ నెలలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ స్టార్ట్ కానుంది. వీలైనంత త్వరలో చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను తెలియజేస్తాం’’ అని సినిమా బృందం తెలిపారు.