పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్
Spread the love

హీరో రామ్ నటించినటువంటి తాజా సినిమా హలో గురూ ప్రేమ కోసమే. ఈ మధ్యే రిలీజ్ ఐన ఈ సినిమా రామ్‌కు ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఈ చిత్రం తరువాత అయన పక్కా మాస్ మసాలా సినిమాకి ఓకే చెప్పినట్లు తెలిసింది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది .హలో గురూ ప్రేమ కోసమే చిత్రం రెలీజ్కి ముందే రామ్‌కు డైరెక్టర్ పూరిజగన్నాథ్ లైన్ వినిపించాడని, అది ఇప్పటికి ఓకే అయిందని తాజా సమాచారం. గత కొన్ని రోజులుగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న పూరిజగన్నాథ్ కథానాయకుడు రామ్ కోసం ఓ పవర్‌ఫుల్ స్టోరీనిరెడీ చేస్తున్నాడని, ఇందులో రామ్ గెటప్, లుక్ కొత్తగా వుంటాయని, ఫిబ్రవరిలో సినిమాని లాంఛనంగా సెట్స్‌పైకి తీసుకాస్తున్నారని తెలిసింది. హలో గురూ ప్రేమ కోసమే అనుకున్నంతగా సంతృప్తినివ్వలేకపోయినా ఆదరించారు. దీనికి బదులుగా ఈ సారి వడ్డీతో సహా మీకు తిరిగిచ్చేస్తాను అంటూ హీరో రామ్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ తాజా వార్తలకు బలాన్ని అందజేస్తుంది .