హలో గురు ప్రేమకోసమే’ టీజర్‌ విడుదల
Spread the love

ఉన్నది ఒకటే జిందగి’ లాంటి చిత్రం తరువాత మళ్లీ ఓ లవ్ స్టోరీ మూవీలో నటిస్తున్నాడు కథానాయకుడు రామ్‌. ‘నేను లోకల్‌’ మూవీతో హిట్‌ పొందిన త్రినాథరావు నక్కినతో కలిసి ఓ రొమాంటిక్‌ స్టోరీని పట్టాలెక్కించాడు. హలో గురు ప్రేమకోసమే.. అంటూ టైటిల్‌తోనే ఆసక్తి పుట్టేలా చేశారు మూవీయూనిట్ .

తాజాగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలియజేసారు . సోమవారం (సెప్టెంబర్‌ 17) సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయకిగా నటిస్తోన్నటువంటి ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తుండగా దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని దసరా బహుమతిగా ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు .