డిసెంబర్ లో రామ్ ,పూరి ల సినిమా షూటింగ్
Spread the love

స్టార్ దర్శకుడుగా తన జీవితంలో పీక్స్ ను చూసిన పూరి జగన్నాధ్ ఈమధ్య ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అవుతున్నాడు . తనకు అలావాటైన రొటీన్ ఫార్మాట్ లో చిత్రాలు తీసుకుంటూ వెళ్ళడం వల్ల అవి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయవంతం కాలేకపోతున్నాయి. ఒక మూవీ విడుదలకు ముందే మరో చిత్రానికి క్లాప్ కొట్టే పూరికి ‘మెహబూబా’ సినిమా తర్వాత గ్యాప్ వచ్చింది.

ఈమధ్య ఎనర్జిటిక్ కథానాయకుడు రామ్ తో సంప్రదింపులు సాగుతున్నాయని చిత్రం ఫైనల్ అవుతుందని వార్తలు వచ్చాయి కదా. అదే టైములో రామ్ మరో దర్శకుడి పేరును కూడా తన తరువాత సినిమాకి పరిశీలిస్తున్నాడని కూడా అన్నారు. తాజా సమచారం ప్రకారం పూరి వినిపించిన ఫైనల్ వెర్షన్ కు రామ్ సరే అన్నాడట . ఈ చిత్రాన్ని రామ్ పెదనాన్నగారు స్రవంతి రవి కిషోర్ – పూరి జగన్నాధ్ లు సంయుక్తంగా నిర్మిస్తారని తెలుస్తుంది.

ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ నుండి స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయట . రామ్ – పూరి కాంబినేషన్లో మూవీ తెరకెక్కడం ఇదే ఫస్ట్ టైం.పూరి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ మూవీ విజయం చాలా కీలకం కానుంది. ఇప్పటికే స్టార్ కథానాయకులెవరు పూరి తో మూవీ చేయడానికి రెడీగా లేరు. మరి ఈ మూవీతో విజయం సాధించి కెరీర్ లో తిరిగి పుంజుకుంటాడేమో వేచి చూడాలి.