సైరా నరసింహారెడ్డి 12 ఏళ్ళ సంకల్పం ఇప్పుడు నేనరవేరింది: రామ్ చరణ్
Spread the love

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్ర టీజర్‌ను (మంగళవారం) ఉదయం 11:30గంటలకు చిత్ర బృందం రిలీజ్ చేసారు, ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఈ చిత్రం ఎలా ఉండబోతోంది? అని చాలా మందికి తెలుసుకోవాలని ఉంది, నాన్నగారి బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేయడం జరిగింది,  12 సంవత్సరాలుగా పరుచూరి బ్రదర్స్ ఇంటికి వచ్చినప్పుడు నాన్నగారికి ఆ చిత్రం గురించి చెప్పమనేవారు, ఆ చిత్రం ఇవాళ అయ్యిందంటే వారి 12ఏళ్ల సంకల్పం, పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావుగార్లకు థాంక్యూ.

కథ వినగానే సురేందర్ రెడ్డి టైమ్ తీసుకుని వారం తర్వాత నాకు సమాధానం చెప్పారు, ఎందుకంటె నాన్న గారిని డైరెక్ట్ చేయడం, అంత పెద్ద కథను నేను డైరెక్ట్ చేయగలనా? అని అన్నీ ఆలోచించుకుని ఓకే చెప్పారు, ఈ చిత్రంలో పార్ట్ అయిన ప్రతి ఒక్కరికీ థాంక్యూ, ఏ సినిమాకి ట్యూన్స్ పంపించినా ఒకే ఒక్కసారి నాన్నగారు ఓకే చేసింది ఇంతవరకూ లేదు, హిందీ ఆయన అయినా సినిమాకు టీజర్‌లోనే అద్భుతంగా మ్యూజిక్ అందించారు అమిత్ త్రివేది. అమితాబ్ గారు, నయనతార గారు, జగపతి బాబు గారు ప్రతి ఒక్కరికీ ఈ సినిమాలో పార్ట్ అయినందుకు థాంక్యూ  అని చరణ్  అన్నారు.