హాట్ గా  ‘హలో గురు ప్రేమకోసమే’ టీజర్
Spread the love

ఎనర్జిక్‌ స్టార్‌ రామ్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా హలో గురు ప్రేమ కోసమే. రామ్‌కు జోడీగా మలయాళ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌ నటిస్తున్న ఈమూవీ టీజర్‌ను సినిమా యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది. టైటిల్‌తోనే ఆసక్తి పెంచేన సినిమా బృందం టీజర్‌తోనూ అదరగొట్టేసింది. ‘చూశావా… నీ కోసమే కాఫీ..’ అంటూ అనుపమ వాయిస్‌తో మొదలై… రామ్‌ సమాధానంతో టీజర్‌ ముగుస్తుంది. వీరిద్దరి మధ్య సంభాషణలకు తోడు.. బ్యాక్‌గ్రౌండ్‌లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌ వింటుంటే.. పేరుకు తగినట్టుగానే ఈ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఫుల్‌ టూ రొమాంటిక్‌గా ఉండబోతుందని అర్థమవుతుంది .

కాగా ‘నేను లోకల్‌’ చిత్రంతో హిట్‌ కొట్టిన త్రినాథ రావు డైరెక్షన్లో దిల్‌ రాజు నిర్మిస్తున్నటువంటి ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదల చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి .