యంగ్‌ మంగ్‌ ఛంగ్‌
Spread the love

ప్రభుదేవాను ఇప్పటి దాకా డాన్సింగ్‌స్టార్‌గానే చూసాం కానీ అభిమానులు త్వరలో ఫైటింగ్‌కింగ్‌గా కూడా చూడబోతున్నారు. అవును ప్రభుదేవా కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమాల్లో యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ సినిమా ఒకటి. వాసన్‌ విజువల్‌ వెంచర్స్‌ పతాకంపై కేఎస్‌.శ్రీనివాసన్, కేఎస్‌.శివరామన్‌ నిర్మిస్తున్నటువంటి సినిమా యంగ్‌ మంగ్‌ ఛంగ్‌. ఇందులో కథానాయికగా లక్ష్మీమీనన్‌ నటిస్తోంది.డైరెక్టర్ తంగర్‌బచ్చన్, ఆర్‌జే.బాలాజి, కట్, మునీశ్‌కాంత్, మారిముత్తు, విద్య నటిస్తున్నారు. బాహుబలి సినిమా విలన్ ప్రభాకర్‌ ఇందులోనూ విలన్‌గా నటిస్తున్నారు. నవ దర్శకుడు అర్జున్‌.ఎంఎస్‌ కథ, కథనం, మాటలు, డైరెక్షన్ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది.

యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ సినిమా వివరాలను డైరెక్టర్ తెలుపుతూ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి అయ్యిందని అన్నారు . ఇటీవల ఇందులోని ప్రభుదేవా విలన్‌ ప్రభాకర్‌తో పోరాడే ఒక భారీ పోరు దృశ్యాలను చిత్రీకరించామని వెల్లడించారు . చెన్నై సమీపంలోని పొళిచ్చనూర్‌ అడవుల్లో 7 రోజులు పాటు షూటింగ్ చేసినటువంటి ఈ పోరాట సన్నివేశాల్లో ప్రభుదేవా, ప్రభాకర్‌లతో పాటు వేలాది మంది సహాయ నటీనటులు పాల్గొన్నారని చెప్పారు. సినిమాలోని హైలెట్‌ అంశాల్లో ఈ పోరాట దృశ్యం ఒకటి అని అన్నారు. ఇందులో ప్రభుదేవా కుంగ్‌ఫూ మాస్టర్‌గా నటిస్తున్నారని అన్నారు . ఆయన నటించిన సినెమాలన్నింటికంటే యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ సినిమా భిన్నంగా ఉంటుందని చెప్పారు . ఇక ప్రభాకర్‌ ఫైట్స్‌లో శిక్షణ ఇచ్చే యూనిట్ కి నాయకుడిగా నటిస్తున్నారని తెలియజేసారు . ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ యంగ్‌ మంగ్‌ ఛంగ్‌ సినిమా ఆబాలగోపాలాన్ని అలరించేవిధంగా ఉంటుందని డైరెక్టర్ అర్జున్‌ అన్నారు . ఈ సినిమాకి ఆర్‌పీ.గురుదేవ్‌ ఛాయాగ్రహణం, అమ్రీశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.