రాజమౌళి కోడలి పల్లకీని మోసిన ప్రభాస్…
Spread the love

దర్శక దిగ్గజం SS రాజమౌళి కొడుకు కార్తికేయ వివాహం, జగపతిబాబు అన్న కుమార్తె పూజాతో అంగరంగ వైభవంగా ముగిసింది.రాజస్థాన్‌ లోని జైపూర్ పట్టణంలోని ఒక ప్యాలెస్‌ లో వరుడు కార్తికేయ, వధువు పూజా ప్రసాద్‌ ఒక్కటయ్యారు.ఈ వేడుకకు 3 రోజుల ముందే చేరుకున్న టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్‌, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌, ఉపాసన, అనుష్క, ఎంఎం కీరవాణి, జగపతిబాబు, రానా తదితరులు వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లిలో సంగీత్ నుంచి అప్పగింతల వరకూ తారక్‌, ప్రభాస్, రామ్ చరణ్‌, రానాలు రాజమౌళితోనే కలిసుండటం గమనార్హం.

అయితే పెళ్లి వేడుకకు ముందు పూజా ప్రసాద్ కూర్చున్న పల్లకిని ఆమె బంధువులతో పాటు హీరో ప్రభాస్‌ కూడా తన చేతులతో మోస్తూ వివాహ మండపానికి తీసుకు వచ్చారు.ప్రభాస్‌ పల్లకిని మోస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో హాల్ చల్ చేస్తుంది.