‘రాజశేఖర్ రెడ్డి’ తండ్రి ‘రాజారెడ్డిగా’ ‘జగపతిబాబు’
Spread the love

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా తెరకెక్కిన సినిమా యాత్ర. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లైఫ్ స్టోరీని ‘యాత్ర’గా మూవీ యూనిట్ తీసింది . 70 ఎంఎం బ్యానర్‌పై శశిదేవిరెడ్డి, విజయ్ చిల్లా ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ మూవీలో వైఎస్ జగన్‌గా సుధీర్‌బాబు నటించారు.

పలు కీలక పాత్రల్లో సుహాసిని, రావు రమేశ్, వినోద్ కుమార్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటిస్తున్నారు. మహి.వి.రాఘవన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డిగా విలక్షణ నటుడు జగపతిబాబు నటించారు. ఈ మూవీకి సంబంధించిన జగపతిబాబు(రాజారెడ్డి) లుక్‌ను సినిమా బృందం నేడు(గురువారం) రిలీజ్ చేసింది. సీరియస్ లుక్‌తో ఆయన అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది .