3 మిలియన్ వ్యూస్ దాటినా హలో గురు ప్రేమకోసమే ట్రైలర్
Spread the love

హీరో రామ్‌, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్‌ మరో మ్యాజిక్‌ చేయడానికి సిద్ధం అయ్యారు. ఉన్నదీ ఒకటే జిందగీ చిత్రంతో మొదటిసారి జోడి కట్టి ప్రేక్షకులను పలకరించారు.మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయినా.. వీరి జోడి మాత్రం మంచి మార్కులే కొట్టేసింది. అందుకే వీరు మరో చిత్రంతో రావడానికి రెడీ అయ్యారు .

త్రినాథ్‌రావు డైరెక్షన్‌లో వస్తున్న హలో గురు ప్రేమకోసమే.. చిత్రంలో రామ్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం వినోదభరితంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్‌, అనుపమా మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ట్రైలర్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇప్పటికే ట్రైలర్‌ మూడు మిలియన్ల వ్యూస్‌ను చేరింది . దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 18న విడుదల కానుంది .