గీత గోవిందం వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి
Spread the love

చాలా భారీ వసూళ్ల దిశగా సాగుతూ సూపర్ హిట్ అనిపించుకుంటోంది ‘గీతగోవిందం’. మూడు రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లతో విజయం సాధించింది. రూపకల్పనకు అయిన బడ్జెట్‌కు మించిన స్థాయిలో షేర్ వసూళ్లను రాబట్టింది ‘గీతగోవిందం’. ఈ సినిమాను నిర్మించి, డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి భారీ లాభాలు దక్కుతున్నాయి. తొలి మూడు రోజుల్లోనే ఈ సినిమా 18 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను సాధించడంతో భారీగా లాభాలు వస్తున్నాయని చెప్పవచ్చు. కాబట్టి మరికొన్ని రోజులు గీతగోవిందం ప్రభంజనం ఉండబోతోంది. దీంతో దీని రూపకర్తలు కొన్ని కోట్ల రూపాయల లాభాలను పొందబోతున్నారని స్పష్టం అవుతోంది.

గీత గోవిందం వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి…

వైజాగ్ -రూ.1.34 కోట్లు

తూర్పు గోదావరి- రూ.1.09 కోట్లు

పశ్చిమ గోదావరి- రూ.0.97 కోట్లు

కృష్ణా- రూ.1.04 కోట్లు

గుంటూరు -రూ.1.20 కోట్లు

నెల్లూరు-రూ.0.44 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి మూడు రోజుల్లో రూ.13.1 కోట్ల షేర్ వసూళ్లను దాకిచూకుంది ‘గీతగోవిందం’. కర్ణాటకలో రూ.1.04 కోట్లు, తమిళనాడులో రూ.0.98 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.01 కోట్ల రూపాయల వసూళ్లతో ఈ సినిమా మొత్తంగా రూ.18.13 కోట్ల రూపాయల షేర్ వసూళ్లను రాబట్టినట్టుగా ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.