‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ నుండి  ‘వెన్నుపోటు’ పాట
Spread the love

డైరెక్టర్ రామ్‌గోపాల్‌ వర్మ తీస్తున్న ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాలోని మొదటి పాట ఫస్ట్‌లుక్‌ రిలీజ్ కానుంది.శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ‘వెన్నుపోటు’ అనే మొదటి పాట ఫస్ట్‌లుక్‌ను రేలీజ్ చేస్తున్నట్లు వర్మ ట్విటర్‌ వేదికగా తెలియజేసారు . విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌, ఆయన రెండో సతీమణి లక్ష్మీ పార్వతి జీవితాల ఆధారంగా వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు ఇందులో చూపించబోతున్నామని వర్మ గతంలో తెలియజేసారు .

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌తోనే చిత్రంపై అంచనాలు పెంచేశారు వర్మ. ఈ సినిమాకి రాకేశ్‌ రెడ్డి ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్‌ మ్యూజిక్ డైరెక్టర్ . మరో విషయం ఏంటంటే.. ప్రముఖ నటుడు బాలకృష్ణ కూడా తన తండ్రి జీవితాధారంగా ‘యన్‌టిఆర్’ టైటిల్‌తో బయోపిక్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ కూడా 21నే రిలీజ్ కాబోతోంది. ఇందులో ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణే నటిస్తూ ప్రొడ్యూసరుగాను వ్యవహరిస్తున్నారు. ‘కథానాయకుడు’, ‘మహానాయకుడు’గా ఈ సినిమా వచ్చే సంవత్సరం జనవరిలో రిలీజ్ కాబోతోంది.