కొత్త హీరోతో ‘శేఖర్ కమ్ముల’
Spread the love

చేసినవి కొన్ని చిత్రాలే అయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఈయన గత సినిమా ‘ఫిదా’ కమర్షియల్ గా పెద్ద విజయం సాధించింది . తెలుగు టాప్ సినిమాల జాబితాలో చేరిన ఆ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల తరువాత సినిమాని ఇంకా మొదలు పెట్టలేదు. ఇటీవలే శేఖర్ కమ్ముల తరువాత చిత్రం ఏషియన్ సునీల్ నిర్మాణంలో జరగబోతుందని అధికారిక ప్రకటన వెలువడింది .

డిస్ట్రిబ్యూటర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలని పెద్ద సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఏషియన్ సునీల్ ప్రొడ్యూసర్గా మారాలని చాలా కాలంగా భావిస్తున్నాడు. ఎట్టకేలకు ఈయన శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చిత్రాన్ని ప్రకటించాడు. శేఖర్ కమ్ముల తన చిత్రంలో ఏ కథానాయకుడిని తీసుకోబోతున్నాడో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. తాజాగా శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా కథానాయకుడిపై క్లారిటీ ఇచ్చాడు.

కొత్త కథానాయకుడితో శేఖర్ కమ్ముల సినిమాని చేయబోతున్నాడు. పలువురు కొత్త కుర్రాళ్లకు ఆడిషన్స్ నిర్వహించి అందులోంచి టాప్ 5 కుర్రాళ్లను ఎంపిక చేసి – వారిలోంచి ఒకరిని శేఖర్ కమ్ముల ఎంపిక చేయనున్నట్లుగా సమాచారం అందుతుంది. త్వరలోనే శేఖర్ కమ్ముల కథానాయకుడిని ప్రకటించబోతున్నాడు.కథానాయకుడిని ప్రకటించకుండా కూడా శేఖర్ కమ్ముల చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తానికి పెద్ద కథానాయకుడితో కాకుండా కొత్త కుర్రాడితో ఈసారి ఫిదా చేయాలని శేఖర్ కమ్ముల డిసైడ్ అయ్యాడు. వచ్చే సంవత్సరం ఎండాకాలం వరకు శేఖర్ కమ్ముల సినిమా వచ్చే అవకాశం ఉందనే టాక్ సినీ వర్గాల్లో వస్తుంది .