హీరో బర్త్ డే పార్టీ నుంచి వస్తూ మద్యం మత్తులో కారుని ఢీ కొట్టిన ప్రముఖ డైరెక్టర్.
Spread the love

టాలీవుడ్ యువ దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) మద్యం మత్తులో తన కారుతో మరో కారుని ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.అమీర్‌పేటకు చెందిన యువ వ్యాపారి హర్మీందర్‌సింగ్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఐ 10 కారు(టీఎస్‌ 08 ఈజే 1786)లో అయ్యప్ప సొసైటీలో ఓ శుభకార్యానికి వెళ్లి అర్ధరాత్రి తిరిగి బయలు దేరామని ఆ సమయం లో దర్శకుడు బాబీ తన కారుని ఢీ కొట్టి  పరారయ్యాడని బాధితుడు సోషల్ మీడియా ద్వారా ఆరోపించాడు. ఈ ఘటన జూబ్లీ హిల్స్ రోడ్ నెం 33 లో చోటు చేసుకుంది.

ఆదివారం రోజు జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబరు 33లోని కేఫ్‌ అబ్బాట్‌ వద్దకు రాగానే అదే సమయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొని వస్తున్న దర్శకుడు బాబీ ప్రయాణిస్తున్న ఎరుపు రంగు వోల్వో కారు వెనుక నుంచి వచ్చి వేగంగా ఢీకొట్టిందని ఆ సమయంలో బాబీ మద్యం సేవించి వాహనాన్ని నడిపాడని హర్మీందర్‌సింగ్‌ ఆరోపిస్తున్నాడు.దీనిపై హర్మిందర్‌ సింగ్‌ నిలదీయగా, తన ఇల్లు ఇక్కడే ఉందని మాట్లాడుకుందామంటూ మద్యం మత్తులో ఉన్న బాబీ చెప్పి క్షణాల్లో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంతపెద్ద తప్పు చేసి కూడా కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపారు.బాధితుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. విషయాన్నీ బాధితుడు సోషల్ మీడియాల ద్వారా తెలియజేసాడు.

బాబీ ప్రతిభావంతుడైన యువ దర్శకుడిగా రచయితగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే బాబీ ఎదుగుతున్నాడు.దర్శకుడిగా తన తొలి చిత్రం పవర్ తో విజయాన్ని అందుకున్నాడు.ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన స్థాయిని పెంచుకుంటుండడం విశేషం.బాబీ ఇప్పటి వరకు రవితేజ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. గత ఏడాది ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా బాబీ స్థాయి పెరుగుతోంది.