ఫోన్లు నో ఎంట్రీ అంటున్న దీప్-వీర్
Spread the love

బాలీవుడ్ నటులు రణ్‌వీర్‌ సింగ్‌-దీపికా పదుకొణే త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. విరాట్‌ కోహ్లి-అనుష్క శర్మల మాదిరి ఈ జంట కూడా ఇటలీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారట… గతంలో నవంబర్‌ 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రేమపక్షుల పెళ్లి నవంబర్ 20 న ఇటలీ లో జరగనున్నట్లు  బాలీవుడ్ మీడియాలో కథనాలు వెల్లడవు తున్నాయి…. ఇటలీలోని కోమో సరస్సు వీరి వివాహ వేడుకకు వేదికగా నిలవబోతుంది. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు 30 మంది కంటే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించకూడదని దీపికా ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ వివాహాన్ని ప్రైవేట్‌గా నిర్వహించాలని చూస్తోంది. రిపోర్టుల ప్రకారం కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారట.

మా పెళ్లికి సెల్‌ఫోన్లు తీసుకురావద్దంటూ అతిథులకు దీపికా-రణ్‌వీర్‌ చెబుతున్నట్టు సంబంధిత వర్గాలు చెపుతున్నారు.. అసలు పెళ్లి అంటే ఏంటి? అందరికీ అడ్డంగా నిలబడి పెళ్లికొడుకు-పెళ్లికూతురుల ఫోటోలు తీయడం. ఎక్కడో ఆఫ్రికా ఆన్ సైట్ లో ఉన్నోడికి స్కైప్ లోనో – వాట్సాప్ వీడియో కాలింగ్ లోనో ఈ పెళ్లి హంగామా లైవ్ లో కవరేజ్ ఇవ్వడం.. ఇదే కదా!  మరిలా అలవాటైన ఫోన్లను పెళ్లి తీసుకురావద్దంటే ఎలా?  కానీ అలాంటివి దీప్ – వీర్ పెళ్లిలో కుదరవట. అంటే గెస్ట్ లకు అడ్డంగా పీసీ శ్రీరాం లాగా పోజిస్తూ నిలబడడాలు.. ఈఎస్పీపీఎన్ కెమేరామేన్ లా మ్యాచ్ లైవ్ కవరేజ్ ఇవ్వడాలు కాదు.  అసలు ఫోన్లు తీసుకుని రావడమే కుదరదట.  ఒక్క ముక్కలో చెప్తే ఫోన్ లు బ్యాన్..  అసలే పెద్ద స్టార్లు కాబట్టి టాప్ లీగ్ గెస్ట్ లందరూ వస్తారు.. అయినా ఫోన్ లేకుండా ఎలా ?