ఎన్టీఆర్ బయోపిక్ లో ‘దాన వీర శూర కర్ణ’…
Spread the love

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తన తండ్రి పాత్రను పోషిస్తున్న “ఎన్టీఆర్” బయోపిక్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ చిత్రాన్ని బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.ఎన్టీఆర్ బయోపిక్ ప్రముఖ నటులతో నిండిపోతుంది.అందుకోసం చాలా మంది ప్రముఖ నటులను చిత్రబృందం ఎంచుకుంది.ఈ చిత్రంలో బసవతారకం పాత్రను బాలీవుడ్ నటి విద్యాబాలన్,శ్రీదేవి పాత్రను రకుల్ ప్రీత్ సింగ్,చంద్రబాబు పాత్రలో రానా,అక్కినేని నాగేశ్వరరావు పాత్రను సుమంత్,జయప్రద పాత్రను తమన్నా హరికృష్ణగా ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ పోషిస్తున్నారు.

ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.NTR కథానాయకుడు,NTRమహా నాయకుడు అనే పేర్లతో ఈ రెండు భాగాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి.ప్రస్తుతం మొదటి భాగమైన ‘కథానాయకుడు’కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ జరుపుతూ వస్తున్నారు.

ఎన్టీఆర్ కెరియర్లో చెప్పుకోదగిన సినిమా ‘దాన వీర శూర కర్ణ’.1977లో విడుదల అయిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది.ఈ చిత్రంలో ‘చిత్రం భళారే విచిత్రం’ అనే పాట పెద్ద హిట్ గా నిలిచింది.అందువల్ల ఎన్టీఆర్ బయోపిక్ లో ఈ పాటను భాగం చెయ్యబోతున్నారు.ఈ రోజు ఆ పాటను చిత్రీకరించడం మొదలు పెట్టనున్నారు.

‘దాన వీర శూర కర్ణ’లో అర్జునుడుగా హరికృష్ణ నటించారు.ఈ సినిమాలో కల్యాణ్ రామ్ అర్జునుడిగా కనిపించనున్నాడు.త్వరలో కర్ణుడిగా బాలకృష్ణ .. అర్జునుడిగా కల్యాణ్ రామ్ కాంబినేషన్లోని ఒక సీన్ ను చిత్రీకరించనున్నారు.జనవరి 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.