ఒకేరోజు రానున్న ‘సాహో’, ‘సైరా’
Spread the love

పెద్ద అంచనాల మధ్య రిలీజ్ కానున్న సినిమాల్లో ‘సాహో’, ‘సైరా నరసింహారెడ్డి’ ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మరోపక్క యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సాహో’. ప్రతిష్ఠాత్మకంగా వస్తున్న ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయని టాలీవుడ్‌లో గుసగుసలు వస్తున్నాయి.‘సైరా’సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది.

ఈ మూవీ రిలీజ్ తేదీ ఖారారైపోయింది అనుకుంటున్న సమయంలో సినిమాని 2019 ఆగస్ట్‌ 15కు వాయిదా వేసినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ‘సైరా’ సినిమా స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోంది కాబట్టి స్వాతంత్ర్య దినోత్సవం రోజూనే రిలీజ్ చేస్తే బాగుంటుందని మూవీ యూనిట్ భావించిందట. మరోపక్క ‘సాహో’సినిమాని కూడా ఆగస్ట్‌ 15న రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. దీని గురించి మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

‘సైరా’ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార కథానాయిక. అమిత్‌ త్రివేది సంగీతం అందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ భారీ బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తోంది. మరోపక్క ‘సాహో’ చిత్రానికి సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.