‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్
Spread the love

అడల్ట్ కంటెంట్ చిత్రాలకు ఇప్పుడు డిమాండ్ పెరిగిందని మూవీ మేకర్స్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు.. అందుకే రొటీన్ ఫార్మాట్ చిత్రాలు ఎన్ని వస్తున్నాయో అన్ని బూతు కంటెంట్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అడల్ట్ కంటెంట్ చిత్రాలు మనకు కామనే గానీ హారర్ లో సెక్స్ మిక్స్ చేసిన చిత్రాలు మాత్రం కొత్తే.

‘ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు’ అనే టైటిల్ తో తమిళంలో ఒక సెక్స్-హారర్ మూవీ వచ్చింది . ఈ సంవత్సరం మే లో విడుదల అయిన ఈ సెక్స్-హారర్ మూవీ పెద్దగా తమిళ ప్రేక్షకులను మెప్పించలేదు. ఇప్పుడు ఇదే చిత్రాన్ని ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టైటిల్ తో తెలుగులో రీమేక్ చేశారు. ఈ మూవీ టీజర్ ఈమధ్యే విడుదల అయింది. ఈ మూవీ టీజర్ లో క్రిటిక్ కత్తి మహేష్ మూవీ స్టోరీని వివరిస్తూ కనిపించాడు. “ఇదో హారర్ మూవీ. స్టోరీ ఏంట్రా అంటే ఊరవతల ఒక బంగాళా(పట్టయా సిటీ లో). పన్లేని నలుగురు ఆ బంగాళాకి వెళ్తారు. అక్కడున్న దెయ్యం వీళ్ళను ఎలా టార్చర్ పెట్టిందనేది స్టోరీ ” అంటూ ఇంట్రో ఇచ్చాడు. ఇక టీజర్ అంతా అయిపోయిన తర్వాత ఎండ్ లో “ఈ మూవీ మామూలుగానే మూడు రోజులు ఆడుతుంది. మీరు ధర్నాలు.. డిబేట్లు పెట్టి సూపర్ హిట్ చేసేయకండి.” అంటూ ఎండ్ చేశాడు.

ఇక టీజర్లో అసలు దృశ్యాల గురించి మాట్లాడుకుంటే దెయ్యం లీడ్ యాక్టర్ కు హస్తప్రయోగం చెయ్యడం లాంటివి ఉన్నావి. దెయ్యం లీడ్ యాక్టర్స్ తో సెక్స్ చేయడం లాంటి సీన్స్ ను ఎవరైనా ఎలా ఎక్స్ ప్లెయిన్ చెయ్యగలరు? ఇది చెప్పిన తర్వాత ఇంకా డిబేట్ అవసరమా? మరి ఈ ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ టీజర్ ను మీరు కూడా చూసి తరించండి