‘మీటూ’ ఎఫెక్ట్..షూటింగ్ ఆపేసిన అక్షయ్ కుమార్
Spread the love

ప్రస్తుతం సినీ పరిశ్రమని ‘మీటూ’ ఉద్యమం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లండన్‌లో ఉన్న తాను నిన్న రాత్రే ఇండియాకు చేరుకున్నానని .. ఇక్కడ జరుగుతున్నదంతా తెలుసుకున్న అని .. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ ఒక్కరితోనూ ఇకపై పనిచేసేది లేదని ఆయన ట్విటర్ ద్వారా తెలియజేసారు . అక్షయ్ ప్రస్తుతం నటిస్తున్నటువంటి ‘హౌస్‌ఫుల్ 4’ సినిమా డైరెక్టర్ సాజిద్ ఖాన్‌పై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ చిత్ర షూటింగ్‌ను ఆపేసాడు .

‘‘నేను నిన్న రాత్రే ఇండియాకు వచ్చాను. డిస్టర్బింగ్ కలిగిస్తున్న న్యూస్ అంతా చూశాను. వెంటనే నేను ‘హౌస్‌ఫుల్ 4’సినిమా నిర్మాతకి ఫోన్ చేసి విచారణ పూర్తయ్యేవరకూ మూవీ షూటింగ్‌ను ఆపాలని కోరాను . ఇలాంటి యాక్షన్ తీసుకోవడం అవసరం. ఆరోపణలు నిర్థారణ అయిన ఏ ఒక్కరితోనూ నేను పనిచెయ్యను. అలాగే వేధింపులకు గురైన వారందరికీ వారు కోరుకున్న న్యాయం జరగాలి’’ అంటూ అక్షయ్ ట్వీట్‌లో తెలియజేసాడు .