జోధ్‌పూర్‌లో ప్రియాంకచోప్రా,నిక్‌జోనస్ ల పెళ్లి
Spread the love

పాప్‌సింగర్ నిక్‌జోనస్, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకచోప్రా జంట ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకొని ఒక్కటికాబోతున్నారు. పెళ్లివేడుకను ఘనంగా నిర్వహించడం కోసం ప్రియాంకచోప్రా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ను పెళ్లి వేదికగా నిర్ణయించారు. నవంబర్ నెలలో అక్కడి చారిత్రక ఉమేద్‌భవన్‌లో పెళ్లి జరగనుంది. ఇటీవలే ప్రియాంకచోప్రా, నిక్‌జోనస్ జోధ్‌పూర్‌ను సందర్శించి పెళ్లి ఏర్పాట్ల గురించి చర్చించారు. వివాహానికి ఇరు కుటుంబానికి సంబంధించినటువంటి రెండు వందల మంది అతిథుల్ని మాత్రమే ఆహ్వానిస్తారని తెలుస్తుంది . పెళ్లి తరువాత హాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం న్యూయార్క్‌లో గ్రాండ్ రిసెప్షన్‌కు సన్నాహాలు చేస్తున్నారు.

బాలీవుడ్ ప్రముఖుల కోసం ముంబయిలో విందు ఏర్పాటు చేస్తారని సమాచారం. హాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన అనంతరం ప్రియాంకచోప్రా గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపును పొందింది . దాంతో ఈ సుందరి వివాహ వేడుక కోసం విదేశీ మీడియా సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ నేపథ్యంలో చారిత్రక నగరం జోధ్‌పూర్‌లో వివాహ వేదికను ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నవంబర్ ద్వితీయార్థంలో వివాహానికి తేదిని నిర్ణయించారని సమాచారం . ప్రస్తుతం ప్రియాంకచోప్రా బాలీవుడ్ చిత్రాలకు దూరంగా ఉంటున్నది. హాలీవుడ్‌లో ఇజ్ ఇన్ట్ ఇట్ రొమాంటిక్ ది స్కై ఈజ్ పింక్ అనే సినిమాల్లో నటిస్తున్నది.