RX100 దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్
Spread the love

చాలా తక్కువ పెట్టుబడితో యువతని ఆకట్టుకునే థీమ్ తో డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ఆరెక్స్ 100 గత సంవత్సరం ఎంత సంచలన విజయం పొందిందో చూసాం. దాని తర్వాత చాలా ఆఫర్లు ఇతగాడిని చుట్టుముట్టినప్పటికీ ఆచితూచి అడుగులు వేసిన అజయ్ భూపతి ఫైనల్ గా బెల్లం కథానాయకుడితో లాక్ అయిపోయాడు. ఇవాళ సాయి శ్రీనివాస్ తన పుట్టిన రోజు సందర్భంగా రమేష్ వర్మ చిత్రంతో పాటు ఇది కూడా అనౌన్స్ చేసేసారు. నిజానికి అజయ్ భూపతి ఓ సీనియర్ స్టార్ కథానాయకుడితో చేస్తాడనే వార్తలు గట్టిగానే ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఆరెక్స్ 100 రిలీజ్ అయి ఏడు నెలలు అవుతున్నా ఇంకా అతన్నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల ఎవరితో ఉంటుందా అన్నే సస్పెన్స్ ఉండేది . ఇవాళ్టితో వాటికి చెక్ పడిపోయింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సంవత్సరం మొత్తం ముగ్గురు డైరెక్టర్లతో చేస్తున్నాడు. తేజది ఫినిషింగ్ స్టేజి లో ఉండగా రమేష్ వర్మ మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనుంది. అజయ్ భూపతి మూవీ తాలూకు జానర్ మాత్రం రివీల్ చేయలేదు.

బడ్జెట్ విషయంలో శ్రీనివాస్ ఎప్పటిలాగే భారీగా వెళ్తాడా లేక వీటితో ఏమైనా తగ్గుతాడా చూడాలి. మొత్తానికి ఆరెక్స్ 100 లాంటి ఒక విభిన్నమైన లవ్ స్టోరీని తెరకెక్కించి మెప్పించిన డైరెక్టర్తో సాయి శ్రీనివాస్ చేయడం అతనికి ప్లస్ అయ్యేదే – రెగ్యులర్ చిత్రీకరణ కథానాయిక టెక్నికల్ బృందం తదితర వివరాలు తెలియాల్సి ఉంది .