డాన్స్ కా బాప్  మన ఎన్టీఆర్ !!
Spread the love

మన టాలీవుడ్ సినిమాల్లో పాటలు మాత్రమే ముఖ్య భాగం కాదు. ఆ పాటల్లో డ్యాన్స్ కూడా ముఖ్యమే.. మన టాప్ స్టార్స్ లో కొంతమంది డ్యాన్స్ ను ఇరగదీసేవారు ఉన్నారు… అలా డ్యాన్స్ ను చింపి.. ఉతికి దండెంపై ఆరేసే వాళ్ళలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. కానీ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత’ ఆడియో రిలీజ్ అయినప్పటి నుండి ‘రెడ్డీ ఇక్కడ చూడు..’ పాట తప్ప మిగతావేవీ ఎన్టీఆర్ డ్యాన్స్ ను వాడుకునేలా లేవని.. ఈ సినిమా ఎన్టీఆర్ డ్యాన్స్ ఎక్కువగా లేకపోవడం లోటేనని అభిమానులు భావించారు. దానికి తగ్గట్టే ఎన్టీఆర్ కూడా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడే సమయంలో ‘హీరో అంటే డ్యాన్స్ మాత్రమే కాదని.. నటనలో ఒక భాగం మాత్రమే డ్యాన్స్’ అని చెప్పడంతో ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యాన్స్ పై పెద్దగా ఆశలు పెట్టుకోనవసరం లేదనే అనుకున్నారు. కానీ రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘అనగనగా అరవిందట తన పేరు..’ పాట ప్రోమో అందరికీ ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. మొదట్లో ఈ పాట విడుదల చేసినప్పుడు క్లాస్ గా ఉందని అన్నారు గానీ స్లో గా పాట హిట్ యింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఎన్టీఆర్ ఇటలీ లోని బ్యూటిఫుల్ లొకేషన్స్ లో గ్రేస్ తో కూడిన కూల్ స్టెప్స్ తో అలరించడం తో ఫ్యాన్స్ ఫుల్ గా ఖుష్ అయ్యారు.

ఇక ఎలాగూ ఊర మాస్ పాట ‘రెడ్డీ ఇక్కడ చూడు..’ ఉంది కాబట్టి అందులో తారక్ చెలరేగిపోవడం ఖాయం అని.. ‘అరవింద సమేత’ లో డ్యాన్స్ కేమీ లోటు లేదని ఊపిరి పీల్చుకున్నారు. క్వాంటిటీ కంటే క్వాలిటీ తో ఆడియన్స్ ను మెప్పిద్దామని గురూజి – తారక్ లు ప్లాన్ వేసినట్టుంది కదా?