క్లైమాక్స్‌ క్రెడిట్ రామ్ లక్ష్మన్లదే..
Spread the love

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్‌తో నాన్ బాహుబలి రికార్డ్స్‌ను తుడిచిపెట్టేసింది. ఈ మూవీ విజయోత్సవంలో భాగంగా గురువారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించింది చిత్ర యూనిట్.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్యాక్షనిజాన్ని కొత్త కోణంలో చూపించాలన్న మా ప్రయత్నం విజయవంతం అయ్యింది. యుద్ధం లేకుండా విజయం ఎలా అన్నదే ఈ సినిమా బేసిక్ పాయింట్. నిజానికి ఈ మూవీ క్లైమాక్స్ నేను అనుకున్నది వేరు. అయితే ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ సలహాతో కీలకమైన క్లైమాక్స్‌ను మార్చాం. మేమంతో కూర్చుని మాట్లాడుకున్నప్పుడు క్లైమాక్స్‌లో యుద్ధం వద్దు అని ఫైట్స్ మాస్టర్స్ సలహా ఇచ్చారు. రొటీన్‌గా ఫైట్ చేసి ముగింపు ఇవ్వడం సెటిల్డ్ మెసేజ్‌ ఇవ్వడమే మంచిదనే నిర్ణయానికి అందరం వచ్చాం. అదే వర్కౌట్ చేశాం. నిజానికి ఇది చాలా రిస్క్. ఎన్టీఆర్ ఒప్పుకోవడం వల్లే ఇది సాధ్యమైంది.