బాలీవుడ్ లో పెళ్ళి భాజాలు !
Spread the love

సినీ జనాలకు  ఇన్నాళ్లు దీపిక పదుకొనే పెళ్లి మ్యాటర్ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగుతూ ఉ౦టు౦ది. ఇదిగో పులి అంటే అదిగో మేక! అన్న చందంగా ఏ క్లారిటీ లేదు, ఉ౦డరు కూడా.కాని  ఓవైపు పెళ్లి పనులు జరుగుతున్న సంగతి అర్థమవుతున్నా.. ఫలానా తేదీ ఫిక్స్ అన్న మాట లేదు ఎక్కడ.అయితే  అలానే ఈ వేడుక వెన్యూ మాత్ర౦  ముంబైలో అన్న మాట క్లారిటీ వచ్చినా.. ఎంత మంది అతిధులో అనే లేక్క మాత్ర౦  తేలనేలేదు. ముంబైలో వెన్యూ అని అన్నారు కాబట్టి – భారీగా అతిధులు విచ్చేస్తారని – ఇండస్ట్రీ మొత్తానికి పిలుపు అందుతుందని అనుకు౦టున్నారు అ౦తా. కానీ దీపిక పెళ్లి ట్విస్టు అంతకంతకు ముదిరిపాకాన పడుతోంది.

ఈ పెళ్లి ఫిక్సయింది. అయితే మాత్ర౦  నవంబర్ 20 ముహూర్తం ఫిక్స్ చేసేశారు పంతుళ్లు. అయితే  పెళ్లి వేడుకను కేవలం ఓ ప్రయివేట్ ఎఫైర్ గానే ఇరు కుటుంబాలు భావించి పరిమితంగా అతిధుల్ని ఆహ్వానించారట. కేవలం 30 మంది అతిధుల సమక్షంలో ఈవెంట్ ని కానిచ్చేస్తారని సమాచార౦. ఇక ఎలానూ తర్వాత రిసెప్షన్ భారీగా ఉంటుంది కాబట్టి దానికి అతిధులు – సెలబ్రిటీలంతా విచ్చేస్తారని చెబుతున్నారు. ఆ మేరకు బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి.