నేనేమీ ఇంకా గర్భం దాల్చలేదు: అనుష్క శర్మ
Spread the love

గత సంవత్సరం డిసెంబర్ లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు వివాహం చేసుకోగా, ప్రస్తుతం అనుష్క గర్భవతి అని వార్తలు వస్తు౦డటంతో వాటి మీద ఆమె క్లారిటీ ఇచ్చింది.అలాంటిదేమీ లేదని, తను ఇంకా గర్భం దాల్చలేదని, మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపింది.

తను యుక్త వయసులోనే పెళ్లి చేసుకున్నానని..,గర్భం వస్తే దాచిపెట్టే అవకాశం కూడా ఉండదని చెప్పింది.ఎవరో కొందరు పుకార్లు పుట్టించి,తరువాత అబద్ధమని తెలుసుకుని, మరోక జంట వెనుక పడుతుంటారని అనుష్క వ్యాఖ్యానించింది.అయితే అనుష్క, షారూక్ జంటగా నటించిన ‘జీరో’ త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.