మళ్ళీ ‘ప్రభాస్’ తో
Spread the love

బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ నటించే మూవీ ఇప్పటి వరకు విడుదల కాలేదు. ‘బాహుబలి’ కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్ ‘సాహో’ చిత్రీకరణతో బిజీ అయ్యాడు. భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ కావడం వల్ల ఈచిత్రం చిత్రీకరణకు టైం తీసుకుంటోంది. ఈ మూవీ విడుదల ఇక వచ్చే సంవత్సరం ఆగస్ట్ లో ఉంటుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ మూవీ విడుదల కాకమునుపే ప్రభాస్ మరో చిత్ర చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కే ఈ మూవీ గురించి తాజా గా ఒక ఇంట్రెస్టింగ్ తెలిసింది.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తోందనే సంగతి తెలిసిన విషయం కదా. ఈ చిత్రంలో మరో కీలకమైన కథానాయిక పాత్ర కూడా ఉందట. ఈ క్యారక్టర్ కోసం కోసం అనుష్కను తీసుకున్నారట. ప్రభాస్ – అనుష్క ల మధ్య ఇది వన్ సైడ్ ప్రేమ కథలా ఉంటుందట.ఇద్దరి మీద ఒక బ్యూటిఫుల్ పాత కూడా ఉంటుందని తెలుస్తుంది.టాలీవుడ్ లోని బెస్ట్ ఆన్ స్క్రీన్ జంటలలో ప్రభాస్-అనుష్కలు ముందువరుసలో ఉంటారు. ఇక ఇద్దరిమీద వచ్చే పెళ్ళి రూమర్లు విని విని అందరూ అలిసిపోయారు. వీటితో సంబంధం లేకుండా మరోసారి ఇద్దరూ సిల్వర్ స్క్రీన్ పై జంటగా కనిపించడం విశేషమే.

ఇప్పటికే ‘మిర్చి’.. ‘బిల్లా’.. ‘బాహుబలి’ చిత్రాల్లో నటించినటువంటి ఈ జంట మరోసారి కలిసి నటించడం తప్పకుండా ఫ్యాన్స్ ను మురిపించే సంగతే.ప్రభాస్-అనుష్కల మధ్య జరిగే ఎపిసోడ్ ఈ చిత్రంలో ఒక హైలైట్ లా ఉంటుందట.