“అంతరిక్షం” నుంచి సమయమా.. లిరికల్ సాంగ్ విడుదల
Spread the love

యంగ్ హీరో వరుణ్‌ తేజ్‌ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘అంతరిక్షం 9000 కె.ఎమ్‌.పి.హెచ్‌’. సంకల్ప్‌ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్ . లావణ్య త్రిపాఠి, అదితి రావు హైదరి హీరోయిన్లుగా నటించారు.ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లిరికల్ సాంగ్ ‘సమయమా’ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.

క్రిష్‌, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.తెలుగులో అంతరిక్షం నేపథ్యంలో వస్తున్న పూర్తిస్థాయి సినిమా ఇదే . అత్యున్నత సాంకేతిక విలువలతో చిత్రాన్ని రూపొందించారు. హాలీవుడ్‌ నిపుణులు తీర్చిదిద్దిన యాక్షన్‌ ఘట్టాలు అబ్బురపరుస్తాయి.డిసెంబర్‌ 21న ఈ సినిమాని విడుదల చేయనున్నారు.